ఏపీ, తమిళనాడులలో భారీ వర్షాలు..
ఏపీ, తమిళనాడులలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లా, తిరుపతి, తిరుమల ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాళహస్తిలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీనితో తిరుపతి జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క తమిళనాడులో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. వెల్లూరు, పెరంబూర్, సేలం, దిండిగల్, తేని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. చెన్నై, విల్లుపురం, తంజావూరు, కడలూరు, పుదుకొట్టై, తిరువల్లూరు, రాణిపేట జిల్లాలలో వర్షాలకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.