ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షం విస్తారంగా పడుతోంది. ఈ వర్షాలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరింతగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అనకాపల్లి, ఏలూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఈరోజు సాయంత్రం వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తాత్కాలికంగా తక్కువ ఎత్తు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

