హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరంలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కూకట్ పల్లి , మాదాపూర్, పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. కొన్నిప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో నాలుగు రోజులుగా వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
