Home Page SliderTelangana

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈనెల 7 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వెల్లడించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.