NewsTelangana

ఇవాళ సాయంత్రం బయటికెళ్తే..అంతే..!

తెలంగాణా రాష్ట్రానికి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్తను చెప్పింది. అదేంటంటే రాగల మూడు గంటల్లో తెలంగాణాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణాలోని అన్నీ జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని వెల్లడించింది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. కాబట్టి తెలంగాణా ప్రజలంతా కొంచెం అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ తెలియజేసింది. అవసరముంటేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని  హెచ్చరించింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ ప్రజలకు సూచించింది. సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది.