Home Page SliderNational

భారీగా పోలీసులు, ఢిల్లీ వైపు సాగుతున్న రైతుల మార్చ్

సాగుచట్టాల్లో మార్పు తేవాలని, రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు సాగుతున్న రైతులను కట్టడి చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించినా, బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, ఢిల్లీ వైపు కవాతు చేస్తూ రైతులు ముందుకు సాగుతున్నారు. కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, పెన్షన్ నిబంధనలు, రుణమాఫీ, లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

వివిధ సంఘాలకు చెందిన రైతులు బుధవారం దేశ రాజధానికి చేరుకుని తమ ప్రదర్శనను కొనసాగించారు. ‘ఢిల్లీ చలో’ పిలుపు మధ్య శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. సింగు, టిక్రి, ఘాజీపూర్‌లో జాతీయ రాజధాని సరిహద్దులను మూసివేశారు. బారికేడ్‌లతో పాటు విస్తృతమైన పోలీసు, పారామిలిటరీని బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో భద్రతను పెంచారు. అల్లర్ల జరక్కుండా ఉండేలా చర్యలు చేపట్టారు. కీలక రహదారుల ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెటల్, కాంక్రీట్ బారికేడ్‌లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు.

మంగళవారం, ఢిల్లీ మెట్రో తొమ్మిది స్టేషన్లలో రైతులు ప్రవేశించకుండా పోలీసులు కట్టడి చేశారు. రాజధాని వైపు రైతుల పాదయాత్రను ఊహించి కొన్ని గేట్లను చాలా గంటలపాటు పోలీసులు మూసివేశారు. పంటలకు కనీస మద్దతు ధరలను డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఢిల్లీకి ఉత్తరాన 200 కిలోమీటర్ల దూరంలో అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. గాలి నుండి టియర్ గ్యాస్ ప్రయోగించడానికి డ్రోన్‌లను కూడా ఉపయోగించారు.