ఇంటర్ పరీక్షలో అపశృతి-విద్యార్థికి గుండెపోటు
గత కొద్ది రోజులుగా చిన్న వయస్సు వారు గుండెపోటుకు గురైన సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్ష రాస్తున్న బిందు అనే విద్యార్థినికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కళాశాల అధికారులు అప్రమత్తమై విద్యార్థినిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. సకాలంలో హాస్పటల్‌కు చేర్చడంతో బిందు ప్రాణాలు దక్కాయి.

