వంటింట్లో సర్వరోగ నివారిణి ఇదే..
ప్రతీ ఇంట్లో వంటింట్లో ఇది తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది సర్వరోగ నివారిణి. అపర సంజీవని లాంటింది. చూడగానే తినాలనిపించే తియ్యటి బెల్లం. జీర్ణసంబంధిత సమస్యలకు, నెలసరి నొప్పులకు, అజీర్తి వంటి అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు, బి, సి,డి, ఇ వంటి విటమిన్లు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. బెల్లం నేరుగా తిన్నా మంచిదే. కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే దాని సుగుణాలు రెట్టింపు అవుతాయి.
బెల్లాన్ని నెయ్యి, ధనియాలు, నువ్వులు, పల్లీలు వంటి పదార్థాలతో కలిపి తీసుకుంటే రుచి పెరగడమే కాదు, చక్కటి ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది. ధనియాలతో నెలసరి సమయంలో తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. అధిక రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది. మెంతులతో కలిపి తీసుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి. తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. నువ్వులతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. పల్లీలలో కలిపి తీసుకుంటే ఆకలి మందగిస్తుంది. శరీరంలో శక్తి పెరుగుతుంది. శొంఠి పొడిలో బెల్లాన్ని కలిపి తీసుకుంటే జ్వరం తొందరగా తగ్గుతుంది. శరీరంలో వాపులు ఉంటే తగ్గుతాయి.

