ఆధారాల్లేని మర్డర్ తో తలనొప్పులు
మీర్ పేట్ హత్య కేసు పోలీసులకు పెను సవాల్ గా మారింది.నిందితుడైన భర్త గురుమూర్తిని పూర్తి స్థాయిలో దోషిగా తేల్చాలంటే కనీస ఆధారలు సేకరించాల్సి ఉండగా…ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు.గత రెండు రోజుల కిందట గురుమూర్తి నివాసంలో ఒకే ఒక్క రక్తపు చుక్క,ఒక టిష్యూ పేపర్ లభ్యం అయ్యింది. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.అయితే గురుమూర్తి ఈ హత్య చేశాడని ఒప్పుకున్నప్పటికీ భారత శిక్షాస్మృతిని అనుసరించి కఠిన శిక్షలు పడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.దాని కోసం సరైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది.దీంతో ఇలాంటి సాక్ష్యాధార రహిత కేసులు నమోదైన ప్రాంతాలలో ఆయా కేసులను స్టడీ చేసేందుకు పోలీసులు దేశం పట్టుకుతిరుగుతున్నారు. ఇలాంటి కేసులను దర్యాప్తు చేసిన టీంల సాయం కూడా తీసుకోబోతున్నారు తెలంగాణ పోలీసులు.సాక్ష్యాధారాలు లేకుండా మర్డర్ చేసిన గురుమూర్తిని దోషిగా చూపించాలంటే పోలీసులు శక్తి మించి శ్రమించాల్సి రావడం ,సవాల్‌గా మారడంతో కేసు కీలకంగా మారింది.
