కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అతడే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తన తర్వాతి వారసుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రతిపాదించారు. సీజేఐ చంద్రచూడ్ నవంబర్ 11న రిటైర్ కాబోతున్నారు. అందుకే తన తదుపరి సీజేఐగా ఖన్నాను ప్రతిపాదించారు. సాధారణంగా రిటైర్ కాబోయే ప్రధాన న్యాయమూర్తి తన తర్వాత సీజేఐగా అనుభవజ్ఞుడైన న్యాయమూర్తిని ప్రతిపాదించడం ఆచారంగా వస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వ ఆమోదం లభిస్తే వారే ప్రధాన న్యాయమూర్తి అవుతారు. సంజీవ్ ఖన్నాను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే ఆయన పదవీకాలం మే 13 2025 నాటికి ముగుస్తుంది.

