Breaking NewsHome Page SliderTelangana

కోతుల‌కు భ‌య‌ప‌డి బిల్డింగ్ మీద నుంచి దూకేశాడు

కోతుల భ‌యంతో బిల్డింగ్ మీద నుంచి దూకి.. ఓ విద్యార్ధి ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు.. భోజనం చేసి క్లాస్‌‌కు వెళ్తూ అక్క‌డే ఉన్న చెట్ల మీద నుంచి బిల్డింగ్ మీద‌కు దూకుతున్న కోతుల‌ను స‌ర‌దాగా అట‌కాయించారు.దీంతో కోతుల‌కు చిర్రెత్తి విద్యార్ధుల‌ను బెదిరించాయి.దాంతో కొంత మంది విద్యార్ధులు పారిపోగా ర‌ఘువ‌ర్ధ‌న్ అనే విద్యార్ధి మాత్రం ఏడుస్తూ అక్క‌డే ఉండిపోయాడు.కోతులు మ‌రింత రెచ్చిపోయాయి.ఆ విద్యార్ధిని మ‌రింత భ‌య‌పెట్ట‌సాగాయి.దాంతో ర‌ఘు కోతుల భ‌యంతో బిల్డింగ్ పై నుంచి దూకేశాడు.ఈ ప్ర‌మాదంలో విద్యార్ధి త‌న రెండు కాళ్ల‌ను కోల్పోయాడు.కాళ్లు పూర్తిగా విరిగిపోయాయ‌ని వైద్యులు తెలిపారు.వెన్నెముక బాగ దెబ్బ‌తిన్న‌ద‌ని చెప్పారు.విద్యార్ధి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని వైద్యులు ప్ర‌క‌టించారు.