తన జుట్టునే ఫ్యాన్‌లా వాడేసుకున్నాడు.. : అమితాబ్
బాలీవుడ్ లెజెండ్ హీరో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. రోడ్డు మీద నడుస్తున్న ఓ వ్యక్తి తన తల వెనుక భాగంలో పొడవాటి జుట్టును ఫ్యాన్ మాదిరిగా తిప్పుతున్న వీడియోను పంచుకున్నారు. ఈ వేసవి వేడిని తట్టుకోవటానికి గాలి కోసం అతను తన సొంత ఫ్యాన్‌ను తీసుకువెళ్తున్నాడు అని క్యాప్షన్ ఇచ్చారు. ఖాకీ డ్రెస్సులో వేగంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తి పోలీస్ ఉద్యోగిలా కనిపిస్తున్నాడు. అయితే.. ఈ మధ్యే ముంభై ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్ ఓ బైకర్‌ను లిఫ్ట్ అడిగి షూటింగ్ లోకేషన్‌కు చేరుకున్నారు. కానీ, బైకర్, అమితాబ్ బచ్చన్ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంపై కొందరు తీవ్ర విమర్శలు చేశారు.

