Breaking NewscrimeHome Page SliderTelangana

వ‌ర‌క‌ట్నం కోసం ముగ్గురిని బ‌లితీసుకున్నాడు

మ‌న‌స్తాపానికి గురై వివాహిత ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న మ‌ద్దుల‌ప‌ల్లిలో జ‌రిగింది.వరకట్నపు వేధింపులు తాళ‌లేక‌, భర్త అక్రమ సంబంధాన్ని త‌ట్టుకోలేక‌…తీవ్ర‌ మనస్తాపానికి గురై పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్ప‌డింది.ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.దీంతో ఆగ్రామ‌మంతా విషాదంలో మునిగిపోయింది.వివ‌రాల మేర‌కు…జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లిలో భర్త తిరుపతి వరకట్నం కోసం భార్య హారిక‌ను వేధించ‌సాగాడు.క‌ట్నం తీసుకురాలేద‌న్న కోపంతో వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఇది భ‌రించ‌లేని హారిక‌ మనస్తాపానికి గురై.. ఇద్దరు పిల్లలకు గడ్డి మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య చేసుకుంది.హారిక అక్కడిక్కడే ప్రాణాలు విడవగా.. మృత్యువుతో పోరాడుతూ పిల్లలు కృష్ణాంత్(9), మాయంతలక్ష్మి(8) ఇవాళ చ‌నిపోయారు. ముగ్గురి మృతికి కారణమైన తిరుపతిని కఠినంగా శిక్షించాలని హారిక కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేశారు.పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.