Home Page SliderTelangana

కల్లులో పురుగు మందు కలిపాడు.. తర్వాత ఏమైందంటే..

ఓ వ్యక్తి తనకు కాకుండా.. మరో ఒకరికి ఎక్కువ కల్లు అవుతుందనే కోపంతో కల్లుకుండలోనే పురుగుమందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కూసుమంచి మండలానికి చెందిన గౌడ కులస్తులు జీళ్ల చెరువులో సమీపంలోని తాళ్లల్లో చాలా ఏండ్లుగా కల్లుగీస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి రమేశ్ గౌడ్ అనే వ్యక్తి.. తోటి గౌడ్ వీరస్వామి గీసే చెట్ల నుంచి ఎక్కువగా కల్లు అవుతుందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎవ్వరు లేని సమయంలో వీరస్వామి గీసే తాటి చెట్టుకు కట్టిన లోట్టిలో పురుగుమందును కలిపాడు. ఇవాళ పొద్దున్న తాటి చెట్టు లోట్టిని విప్పేక్రమంలో వాసన రావటంతో పురుగుమందు కలిపిన విషయా న్ని వీరస్వామి గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మందు కలిపిన రమేశ్ గౌడ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.