కోపంలో క్లాస్ మేట్‌ని చంపేశాడు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. సహచర విద్యార్ధిని కోపంలో చంపేశాడు.దాని కోసం ఏకంగా కుట్రపూరితంగా ఓ కత్తిని కూడా తరగతి గదికి వచ్చేటప్పుడు చాటుగా తీసుకొచ్చుకున్నాడు.ఈ ఘటన ఢిల్లీ నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలోని ఓ స్కూల్ లో 7వ తరగతి విద్యార్ధులకు ఎక్స్‌ట్రా క్లాస్ లు జరుగుతుండగా విశ్రాంతి సమయంలో పలువురు విద్యార్ధులు బయటకు వచ్చారు.గతంలో ఓ విద్యార్ధితో గొడవ పడుతున్న మరో విద్యార్ధి…వ్యూహాత్మకంగా గేటు బయటకు పిలిచి దాడి చేశాడు.దాని కోసం చాకు కూడా తెచ్చుకున్నాడు.అప్పటికే రక్తపు మడుగులో ఉన్న విద్యార్ధి కొన ఊపిరితో ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అయితే మార్గమధ్యలోనే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

