Home Page SliderTelangana

ఆగిన గుండెకు ప్రాణం పోశాడు..

రెండు రోజుల వయసు బాబుకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. మెదక్ పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన గర్భిణీ అమీనా బేగం నిన్న మెదక్ ఎంసీహెచ్ ఆసుపత్రిలో డెలివరీ అయి బాబు పుట్టాడు. అయితే.. ఆ బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో డాక్టర్ నీలోఫర్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. ఈ మేరకు 108 అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో నర్సాపూర్ వద్దకు వెళ్లగానే బాబుకు హార్ట్ బీట్ ఆగిపోవడంతో టెక్నీషియన్ రాజు స్పందించి బాబుకు సీపీఆర్ చేశారు. దీంతో కొద్ది సేపట్లోనే బాబుకు హార్ట్ బీట్ మొదలైంది. టెక్నీషియన్ సరైన సమయంలో స్పందించి బాబు ప్రాణాలను కాపాడడంతో కుటుంబ సభ్యులు రాజును అభినందించారు.