crimeHome Page SliderTelanganatelangana,viral

హైదరాబాద్‌లో హవాలా డబ్బు..

హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు నిఘా వేసి, దాదాపు రూ.75 లక్షల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. కరీంనగర్‌కు చెందిన సాయికృష్ణ, రాయదుర్గంలో ఉండే రవి అనే వక్తులు బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుండి డబ్బు తీసుకుని వస్తున్నారు. వారిని పోలీసులు పట్టుకోవడంతో మియాపూర్‌కు వెళ్లాక సురేందర్‌కు ఫోన్ చేస్తే ఎవరికి ఇవ్వాలో చెప్తారని వారు పోలీసులకు చెప్పారు. ఈ సొమ్మును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు.