విశ్వమంత సముద్రం గురించి విన్నారా
బీచ్ ఒడ్డున కూర్చొనో నిలబడో లేదా షిప్‌లో ప్రయాణిస్తూ సముద్రాన్ని చూస్తుంటే అసలు దీనికి అంతమే లేదని ఎంతో తన్మయత్వానికి లోనౌతూ, సంభ్రమాశ్చర్యానికి గురౌతుంటాం.అలాంటి సముద్రాన్ని ఏకంగా ఆకాశంలో గుర్తించారు శాస్త్రవేత్తలు.అదేంటి ఆకాశంలో సముద్రమేంటనుకుంటున్నారా.అంతే మరి…మనం ఉంటుంది కూడా ఆకాశంలో(సన్ గెలాక్సీ)నే కదా! భూమి నుంచి 1200 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఓ బ్రహ్మాండ సముద్రాన్ని గుర్తించారు.వాస్తవానికి ఇలాంటిదేదో ఉందని 50 ఏళ్ల కిందటే క్వాసర్ ( బ్లాక్ హోల్ ఎనర్జిటిక్ సెంటర్) ద్వారా కనుగొన్నప్పటికీ ఇప్పుడు అన్నీ ఆధారాలతో ఆవిషయాన్ని బహిర్గతపరిచారు. కృష్ణబిలం శక్తి ఉత్పత్తి కేంద్రం చుట్టూ ఈ బ్రహ్మాండ సముద్రం తిరుగుతున్నట్లు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి పరిమాణంతో పోల్చితే బ్రహ్మాండ జలాశయం మొత్తం నీరు 140లక్షల కోట్ల రెట్లెక్కువని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు.ఇది మన సూర్యుని కన్నా 2000రెట్లు పెద్దదని, 1000 రెట్ల సూర్య కాంతి కన్నా అధిక శక్తిని వెలువరించగలదని తెలుసుకున్నారు. చంద్రయాన్,శుక్రయాన్ సాగించడానికే మనకు ఇంత కాలం పట్టింది.ఇక ఆ బ్రహ్మాండ సముద్రాన్ని చేరుకోవాలంటే ఇంకెన్నివందల సంవత్సరాల సమయం పడుతుందో కదా!

