‘ఆదిపురుష్’లో రామబంటు కుర్చీ చూసారా?
భారీ అంచనాలతో రేపు శుక్రవారం రిలీజ్ కాబోతున్న ‘ఆదిపురుష్’ చిత్రం విశేషంగా అడ్వాన్స్ బుకింగ్‌లను సంపాదించుకుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వేలసంఖ్యలో టికెట్లు కొని, అనాథలకు, పేదవారికి పంచేస్తున్నారు. ఈ చిత్రం ప్రదర్శింపబడే థియేటర్లలో రామబంటు ఆంజనేయుడికి ప్రత్యేక సీటుని కేటాయిస్తామని, ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ప్రకటించారు నిర్వాహకులు. ఇప్పుడు దానిని నిలబెట్టుకుంటూ థియేటర్ సీట్ల మధ్య సీటును ప్రత్యేక అలంకారంతో తయారు చేస్తున్నారు. హనుమంతుడి ఫొటోతో పాటు ‘జైశ్రీరామ్’ అని రాసి ఉన్న బట్టను కుర్చీపై వేసి, ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నారు. దీనితో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి పది రోజుల పాటు సాధారణ ప్రేక్షకులకు అందని రేట్లతో నిరాశ కలిగిస్తోంది ఆదిపురుష్. టికెట్‌కు 50 రూపాయల చొప్పున పది రోజుల పాటు పెంచుకోవచ్చని తెలంగాణా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేసింది. అయితే థియేటర్ యాజమాన్యాలు మరో వంద వడ్డించి, టికెట్ రేటును రెట్టింపు చేస్తున్నారు.