ఆషాడమాసంలో సంజీవనిలాంటి ఈఆకు తిన్నారా?
ఆషాడమాసానికి మన సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఈకాలంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. అందుకే ఫ్లూ, జలుబు, దగ్గులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వీటి నుండి ఆరోగ్యం కాపాడుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు చాలా ఉపయోగపడతాయి. వీటిలో మునగాకు ఒక్కటి. ఈ నెలలో మునగాకు తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆడవారికి ఈ నెల చాలా ప్రత్యేకమయ్యింది. ఈ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం, నోములు, వ్రతాలు మొదలుపెట్టడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మునగాకులో పుష్కలంగా ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. వీటిలో విటమిన్ ఎ,సి ఉంటాయి. దీనితో వ్యాధినిరోధక శక్తి మెరుగు పడుతుంది. ఐరన్, కాల్షియం వల్ల రక్తహీనత తగ్గి, ఎముకలు దృఢంగా మారతాయి. వర్షాకాలంలో చల్లటి ఉష్ణోగ్రత నుండి కాపాడి, శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది మునగాకు. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే మునగాకు తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలోని పీచు వల్ల శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది. పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలోని చక్కెరను నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఆడవారికి గర్భశయ, అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నియంత్రిస్తుంది. రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించి, శరీరంలో మలినాలను బయటకు పంపడంలో మునగాకు అద్భుతంగా పని చేస్తుంది.