జీన్స్ ప్యాంట్లతో పర్యావరణానికి హాని!
జీన్స్ ప్యాంట్లతో పర్యావరణానికి ఊహించనంత హాని జరుగుతోందని ఓ సర్వేలో తేలింది. జీన్స్ ఉత్పత్తి చేసే సమయంలో కార్బన్ డయాక్సైడ్ భారీగా వెలువడుతోందని పరిశోధకులు తెలిపారు. చైనాలోని గాంగ్‌డాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు జీన్స్‌తో కలిగే పర్యావరణ కాలుష్యంపై పరిశోధనలు చేయగా.. జత జీన్స్ వల్ల 2.5 కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతోందని తెలుసుకున్నారు. ఇది పెట్రోల్ కారులో 10 కి.మీ. ప్రయాణించడంతో సమానమట.

