చిరు, పవన్, చరణ్‌లతో మల్టీస్టార్ చిత్రాలకై ప్లాన్ చేసిన హరీష్ శంకర్!
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలో రిలీజ్‌కి రెడీ అయింది. ఆగస్ట్ 14న స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. మెగా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక విషయాన్ని వెల్లడించారు.
నేను పవన్ కళ్యాణ్, చరణ్, చిరంజీవి, ముగ్గురికి సంబంధించిన లైన్ ఎప్పటి నుండో రెడీ చేసుకున్నా, అది చేస్తే అన్ని పాన్ ఇండియా మూవీస్ కన్నా, చాలా పెద్ద మూవీ అవుతుంది అని హరీష్ శంకర్ అన్నారు. పుష్ప, కాంతారలు మొదట పాన్ ఇండియన్ సినిమాలుగా ప్లాన్ చేయలేదు, అంతా యాక్సెప్ట్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. మిస్టర్ బచ్చన్ చిత్రం రిలీజ్ సందర్భంగా చేస్తున్న ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.