Home Page SliderNews AlertTelangana

ఏపీ రాజకీయాలపై హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒక నాయకుడు హైటెక్‌ అంటూ ఊదరగొట్టాడని ఎద్దేవా చేశారు. ఏపీ వాళ్లది ప్రచారం ఎక్కువ.. తెలంగాణాకి పని ఎక్కువగా  ఉంటుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పదనం ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్‌ చేశారని చెప్పారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందన్నారు.