Home Page SliderTelanganatelangana,

హైకోర్టులో హరీష్‌రావు క్వాష్ పిటిషన్

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణన్ రావుపై కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో చేస్తున్న పనే అని, తనపై కేసును క్వాష్ చేయాలంటూ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిరాధార ఆరోపణలతో సంబంధం లేని కోసు పెట్టారని, తనపై కేసు కొట్టి వేయాలని, అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.