హరీష్ రావుకి మళ్లీ ఊరట
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి,సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్‌రావుకి ఊరట లభించింది.ఈ విషయంలో హరీష్‌రావుని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం మళ్లీ పొడిగించింది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును క్వాష్ చేయాలని హరీష్ రావు గతంలో కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే పిటీషనర్ సకాలంలో స్పందించకుండా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఆయనకు ఊరట లభించింది.