అధికారులపై హరీష్ గుస్సా..
వ్యవసాయ మార్కెట్ అధికారులపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. తెలంగాణలోని సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్ల కల్లాలను హరీష్ రావు పరిశీలించారు. కనీస సౌకర్యాలు లేవని, అధికారులు పట్టించుకోవడంలేదని హరీష్ రావుకు రైతులు తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. దీంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని హరీష్ రావు ఆదేశించారు.

