Breaking NewsHome Page Sliderhome page sliderNationalNewsNews AlertSportsviral

గ్రీకో-రోమన్‌ లో చరిత్ర సృష్టించిన హర్దీప్!

  • ప్రపంచ అండర్-17 రెజ్లింగ్‌లో భారత యువ రెజ్లర్‌కు స్వర్ణం

భారత రెజ్లింగ్ చరిత్రలో మరో మైలురాయి. అంచనాలను తారుమారు చేస్తూ, 16 ఏళ్ల హర్దీప్ గ్రీకో రోమన్ ప్రపంచ అండర్-17 చాంపియన్షిప్‌లో స్వర్ణ పతకం సాధించి దేశ గర్వంగా నిలిచాడు. బుధవారం నిర్వహించిన 110 కేజీల ఫైనల్లో హర్దీప్, ఇరాన్‌కు చెందిన యజ్దాన్ రెజా డెల్రూజ్ పై 3-3 స్కోరుతో గెలిచాడు. అంతిమ స్కోరు సమంగా ఉన్నప్పటికీ, చివరి పాయింట్‌ సాధించిన హర్దీప్‌కు విజయం లభించింది. తద్వారా, గ్రీకో రోమన్ ప్రపంచ అండర్-17 ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలిచిన నాలుగో భారత రెజ్లర్‌గా హర్దీప్‌ చరిత్ర సృష్టించాడు. చరిత్రలో నిలిచిన నాలుగో భారతీయుడు ఇంతకు ముందు ఈ ఘనత సాధించిన భారత రెజ్లర్లు వినోద్ కుమార్ (45 కేజీలు -1980), పప్పూ యాదవ్ (51 కేజీలు-1992),సూరజ్ (55 కేజీలు-2022) ఇప్పుడు హర్దీప్‌ వారి సరసన చేరి భారత రెజ్లింగ్‌ను ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు చేర్చాడు. జయప్రద ర్యాలీ హర్దీప్ పోరాట ప్రయాణం రౌండ్ 1 బక్తూర్ సొవెట్ఫాన్‌ కజకిస్తాన్ పై 2-0, ప్రీ క్వార్టర్‌ ఫైనల్ తొమెల్కా పోలాండ్ పై 4-2,క్వార్టర్ ఫైనల్ అనతోలి నవచెంకో ఉక్రెయిన్ పై 9-0,సెమీఫైనల్ ఎమ్రుల్లా కప్కాన్‌ టర్కీపై 4-2, హర్యానాలోని ఝాజర్ జిల్లాకు చెందిన హర్దీప్, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ప్రస్తుతం బహదుర్గఢ్‌లోని ‘హింద్ కేసరి’ సోనూ అఖాడాలో ధర్మేందర్ దలాల్ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. మరిన్ని పతకాలు ఖాయం! భారతకు ఈ టోర్నీలో మరో నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో నాలుగు రెజ్లర్లు ఫైనల్లోకి ప్రవేశించారు. రచన 43 కేజీలు vs జిన్ హువాంగ్, మోనీ 57 కేజీలు vs మదఖియా ఉస్మనోవా కజకిస్తాన్, అశ్విని విష్ణోయ్ 65 కేజీలు vs ముఖాయో రఖిమ్ జొనోవా ఉజ్బెకిస్తాన్, కాజల్ 73 కేజీలు vs వెన్జన్ కియు చైనా . ఫైనల్స్‌లో భారత మహిళా రెజ్లర్లు మరిన్ని పతకాలపై కన్నేసి పోరాడనున్నారు.