రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు స్నేహారెడ్డి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,ఆయన భార్య ఉపాసనలకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ సతీమణి స్నేహారెడ్డి 11 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా తాము ఈ మధ్యనే దిగిన ఫొటోను జత చేశారు. ఈ ఫొటో వరుణ్‌తేజ్-లావణ్యల ఎంగేజ్‌మెంట్ సందర్భంగా తీసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు మొదటి సారిగా తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.

