మోదీకి, పుతిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రియమైన స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి “ఆల్ ది బెస్ట్” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మక ఉజ్బెక్ నగరం సమర్‌కండ్‌లో రెండేళ్ల తర్వాత జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు వేళ ప్రధాని మోదీ శనివారం 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పుతిన్ భారత్‌కు, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఇండియాకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నానన్నారు పుతిన్. నా ప్రియమైన మిత్రమా, మీరు మీ పుట్టినరోజును జరుపుకోబోతున్నారని కూడా నాకు తెలుసు. రష్యన్ సంప్రదాయం ప్రకారం, మేము ఎప్పుడూ ముందుగా అభినందనలు చెప్పలేము. కాబట్టి, నేను ఇప్పుడు అలా చేయలేనంటూ చెప్పుకొచ్చారు.

కానీ మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు పుతిన్. స్నేహపూర్వక భారత దేశానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్న ఆయన… మీ నాయకత్వంలో భారతదేశం శ్రేయస్సును కోరుకుంటున్నామన్నారు. రష్యా మరియు భారతదేశం మధ్య సంబంధాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వ్యూహాత్మక విశేష భాగస్వామ్యం ముందుకు సాగుతుందని ఇరుదేశాధినేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకు ముందుకు అధ్యక్షుడు పుతిన్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని… వాణిజ్యం, ఇంధనం, రక్షణ, పలు రంగాలలో భారత్-రష్యా సహకారాన్ని మరింతగా కొనసాగించడంపై చర్చించే అవకాశం లభించిందని మోదీ ట్వీట్ చేశారు. ఎనిమిది దేశాల ప్రభావవంతమైన శిఖరాగ్ర సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి, తైవాన్ జలసంధిలో చైనా దూకుడు… సైనిక చర్యలంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంతో గందరగోళం చెలరేగింది. జూన్ 2001లో షాంఘైలో ప్రారంభించబడిన SCO దాని ఆరు వ్యవస్థాపక సభ్యులైన చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లతో సహా ఎనిమిది మంది పూర్తి సభ్యులను కలిగి ఉంది. 2017లో ఇండియా, పాకిస్తాన్ పూర్తి సభ్యులుగా చేరాయి.
