Home Page SliderNational

మా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు : చంద్రబాబు

నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయనకు దేశంలోని పలువురు సినీ,రాజకీయ,అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా బాలయ్యకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “నటునిగా కళాసేవ. ఎమ్మెల్యేగా ప్రజాసేవ. ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవ చేస్తున్న మా బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి మనసుతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మీరు..నిండు నూరేళ్లు ఆనందంతో ,ఆరోగ్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను” అని చంద్రాబాబు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.