గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో “నాట్కో లో కొలొస్టమి” కేంద్రం
రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో లో కొలొస్టమి కేంద్రాన్ని ప్రారంభించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ఆసుపత్రి లో క్యాన్సర్ రోగులకు అవగాహనా కల్పించేందుకు కోలోప్లాస్ట్ కేర్ క్లినిక్ ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ కేంద్రం క్యాన్సర్ రోగులకు అవగాహన కల్పించేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొలొస్తిమి బ్యాగ్ ఏవిధంగా రోగులు ఉపయోగించుకోవాలన్న అంశాలపై కేర్ క్లినిక్ సభ్యులు వివరిస్తారని అయన చెప్పారు. క్యాన్సర్ రోగులతో పాటు సాధారణ శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకు బయట పెట్టిన ప్రేగుకు సంరక్షణ ఏవిధంగా ఉంచాలన్న అంశాలపై వారు అవగాహనా కల్పిస్తారని అయన వివరించారు.