తుపాకీ పేలి కానిస్టేబుల్ మృతి
ఏఆర్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గుంటూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది.AR హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వంశీకృష్ణ…విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచాడు. ఓ ఆథ్మాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్ విధులు నిర్వర్తిస్తున్న వంశీకృష్ణ రక్తపు మడుగులో పడిఉండటాన్ని ఫంక్షన్‌కి వచ్చినవారు గమనించారు. తన వద్ద రక్షణగా ఉన్న తపంచా నుంచి తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయితే ఇది అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు.