గుల్ల గుల్ల రోడ్లేస్తే జైళ్లకే
మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం రాజీలేకుండా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చాకే దేశ వ్యాప్తంగా రోడ్ల అనుసంధానం విస్తృతంగా జరిగిందని గుర్తు చేశారు.దేశం అభివృద్ది చెందాలంటే నాణ్యమైన రహదారులు,మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దీని కోసం కేంద్ర బీజెపి రోడ్ల నాణ్యతలో రాజీలేకుండా వ్యవహరిస్తుందన్నారు.నాసిరకం రోడ్లు నిర్మిస్తే ఇక నుంచి సదరు కాంట్రాక్టర్లపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.అవసరమైతే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి జైళ్లకు కూడా పంపిస్తామని స్పష్టం చేశారు.

