Home Page SliderTelanganatelangana,viral

హైదరాబాద్ తల్లీ కుమార్తెలకు గిన్నిస్ రికార్డ్..

హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన కుమార్తెలతో కలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించడం విశేషం. తన కుమార్తెలు లీషా ప్రజ్ఞ(8), అభిజ్ఞ(5)లతో కలిసి 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఈ రికార్డు సాధించారు. గతేడాది డిసెంబర్‌లో హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియోలు అప్‌లోడ్ చేశారు. దీనితో గిన్నిస్ బుక్ అధినేత ఈ సంగీత కళాకారులను విజేతలుగా ప్రకటించారు. వారిని జూమ్ మీటింగ్ ద్వారా అభినందించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వారిని అభినందించారు.