Andhra PradeshHome Page Slider

గుడివాడ అమర్నాథ్‌.. దిగజారుడు భాష మానుకోండి…

ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. గుడివాడ అమర్నథ్ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంథరేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక, వైసీపీ మంత్రులు అడ్డగోలుగా, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు విష్ణువర్థన్ రెడ్డి. పురంధరేశ్వరి రాష్ట్రప్రభుత్వ అప్పులు, అవినీతి గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ‘రోత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిన మీరు కూడా మాట్లాడేవారేనా? రాజకీయ విమర్శలు చేసినప్పుడు వాటికి రాజకీయంగానే సమాధానం చెప్పుకోవడం నేర్చుకోండి.’ అంటూ హితవు చెప్పారు. అడ్డగోలు అవినీతి, అప్పుల్లోనూ అక్రమాలు, చేతకాని పరిపాలన చేసిన ప్రభుత్వం భారత దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు.  చేతనైతే పురంధరేశ్వరి దేవి గారు అడిగిన ప్రశ్నలకు అంశాల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం ప్రజలముందు విడుదల చేయండి , లేదా మీ దగ్గర లెక్కలు వాటి సమాధానాలు ఉంటే బహిరంగ చర్చకు  సిద్ధం కండి అని సవాల్ చేశారు.  భారతీయ జనతా పార్టీ  తరపున వైసీపీకి తాను బహిరంగ ఆహ్వానం పలుకుతున్నానని పేర్కొన్నారు.