గ్రోక్ అభ్యంతరకర వ్యాఖ్యలు…సంస్థకు నోటీసులు..
ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ సంస్థ ఎక్స్‌ఏఐ గ్రోక్ ఏఐ చాట్‌బాట్ సేవల్ని అందిస్తోంది. తాజాగా రూపొందించిన ఈ గ్రోక్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు కొన్ని తిట్ల రూపంలో, అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేస్తోంది. హిందీ భాషలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సామాజిక మాధ్యమాలలో వివాదాలు తలెత్తాయి. ఈ సంగతి కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్స్ ప్రతినిధులతో ఈ విషయమై ఆరా తీసింది. వారితో సంప్రదింపులు జరిపి ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ మోడల్‌ను ఎలాన్ మస్క్ అత్యంత తెలివైన సాధనంగా అభివర్ణించడం విశేషం.