చంద్రయాన్-5 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్-5 మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-5లో 250 కిలోల రోవర్ ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జపాన్ తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. జాబిల్లి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-4 మిషన్ ను 2027లో ప్రయోగిస్తామనిచెప్పుకొచ్చారు.అయితే ఇంత వరకు చంద్రుని దక్షిణార్ధ గోళం ఏ దేశపు రోవర్ లు కూడా ల్యాండ్ అవలేదు.భారత్ పంపిన చంద్రయాన్ మాత్రమే సౌత్ పోల్ ఆప్ మూన్‌పై లాండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.