Andhra PradeshBusinessHome Page SliderNews Alert

ఏటికొప్పాక లక్కబొమ్మలకు అరుదైన గౌరవం

అందమైన ఏటికొప్పాక లక్కబొమ్మలకు కేంద్ర ప్రభుత్వ అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి. అందానికి, కళాకారుల నైపుణ్యానికి ఏటికొప్పాక లక్కబొమ్మలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లోనూ.. ఏడు కొప్పాక బొమ్మల శకటం సత్తా చాటిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త చేతులు మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇప్పటికే.. గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మలు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు పొందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవార్డుతో లక్కబొమ్మల ఖ్యాతి మరింత పెరుగుతుందని తెలిపారు. మన లక్క బొమ్మలకు మరింత ఖ్యాతి రావాలని ఆకాంక్షించారు.