Home Page SliderNational

గ్రాండ్‌గా హీరామండీ హీరోయిన్ మెహందీ వేడుక

బాలీవుడ్‌ నుండి ఇటీవల ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన హీరామండీ సీరిస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఈ సీరీస్‌లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే సోనాక్షి సిన్హా  రేపు తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకోనున్నారు. కాగా రేపు ముంబైలో జరిగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోనాక్షి సిన్హా మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.మరోవైపు తన కూమార్తె పెళ్లి చేసుకోబోతుందన్న విషయం తమకు తెలియదని సోనాక్షి తండ్రి ఇటీవల మీడియాకు తెలిపారు. కాగా సోనాక్షి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఆశీర్వదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. దీంతో సోనాక్షి వివాహం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా స్పందించిన ఆమె తండ్రి వాటిని ఖండించారు.