Home Page SliderNational

రైతుల ఆదాయం రెట్టింపు దిశగా ప్రభుత్వ ఆలోచన: మోడీ

దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోడీ అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ 17వ విడత నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోని రైతులందరూ మా వెంటే ఉన్నారు.  వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశం స్వయం సమృద్ధి దిశగా దూసుకుపోతోంది. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తాం అని ప్రధానమంత్రి అన్నారు.