HYDRA కు గవర్నర్ ఆమోదముద్ర
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్‌కు గవర్నర్ ఆమోదముద్ర పడింది. హైడ్రాకు విస్తృత అధికారాలను కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీనికి రాష్ట్రగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో హైడ్రా చేయబోయే పనులకు చట్టబద్దత లభించింది. దీనిని అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదిస్తారని సమాచారం.

