NewsNews AlertTelangana

ఈటలను పరామర్శించిన గవర్నర్‌

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ గురువారం పరామర్శించారు. తండ్రి ఈటల మల్లయ్య (104) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం హన్మకొండ జిల్లాలోని స్వగ్రామం కమలాపూర్‌లో జరిగాయి. మల్లయ్య దశదిన కర్మ పూర్తయ్యే వరకు ఈటల రాజేందర్‌ అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లిన గవర్నర్‌.. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

తమ కుటుంబ సభ్యుల బాధలో పాలు పంచుకున్న గవర్నర్‌కు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ కూడా ఈటలను ఫోన్‌లో పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.