NationalNews

అగ్నివీరులకు కేంద్రం బంపర్ ఆఫర్

అగ్నిపథ్ పై వస్తున్న విమర్శలను కేంద్రం కొట్టిపారేసింది. దుష్ప్రచారాలను నమ్మొద్దని… కేంద్ర బలగాల రిక్రూట్మెంట్ విషయంలో జరగుతున్న ప్రచారమంతా అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. సెంట్రల్ ఆర్ముడ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) విభాగంతోపాటు, అసోం రైఫిల్స్‌లో అగ్నివీరులకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. రెండు విభాగాల్లో చేరేందుకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిని సైతం అందిస్తున్నట్టు పేర్కొంది. అగ్నివీర్ మొదటి బ్యాచ్ అభ్యర్థులకు మాత్రం… ముందుగా
నిర్ణయించిన దానికంటే ఐదేళ్ల మినహాయింపు సైతం అందిస్తోంది. దీనికి సంబంధించి హోం మంత్రి అమిత్ షా ఓ ప్రకటన విడుదల చేశారు. మిలటరీ రిక్రూట్మెంట్ వయస్సును సైతం ఇప్పటికే 21 ఏళ్ల నుంచి 23కు ప్రభుత్వం మార్చింది. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ చేయనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర పారామిలటరీ విభాగాల్లో ప్రస్తుతం 73 వేల ఖాళీలున్నాయ్. సరిహద్దు భద్రతా దళం (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP),
శాస్త్ర సీమా బల్ (SSB), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఐదు విభాగాల్లో… ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

వాటితోపాటు… CAPF, అస్సాం రైఫిల్స్‌లో 73,219 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ లెక్కలు చెబుతున్నాయ్. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో 18,124 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CAPF 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అతి పెద్ద వాటితోపాటు… CAPF, అస్సాం రైఫిల్స్‌లో 73,219 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ లెక్కలు చెబుతున్నాయ్. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో 18,124 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CAPF 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ అతి పెద్ద ఎంప్లాయర్‌గా ఉంది. అగ్నిపథ్ ప్రకటన తర్వాత దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయ్. ఒక్కసారిగా ఊహించని కల్లోలంతో కేంద్రం… కొత్త కార్యాచరణతో అడుగులు వేస్తోంది. తెలంగాణలో పోలీసుల కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా… కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. యూపీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బీహార్‌లో నిరసనల మధ్య ఉప ముఖ్యమంత్రి రేణుదేవి ఇంటిపై దాడి జరిగింది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై యువత నిరసన వ్యక్తం చేస్తోంది.