అయిదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మార్చేద్దాం.
భారతదేశంలో 75 ఏళ్లలో పేద విద్యార్థులకు కావాల్సిన సమగ్ర వనరులను ఇవ్వలేకపోయారు. ఇప్పుడు తమిళనాడులో సీఎం స్టాలిన్ మొదలుపెట్టారు. మా ప్రభుత్వం ఢిల్లీలో ఇప్పటికే అమలు చేశాం. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా ముందుకొస్తే అయిదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని మార్చేయవచ్చు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చు అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రతి నెలా రూ. 1000 అందించే “పుదుమై పెణ్” (నవ మహిళ) పథకాన్ని స్టాలిన్ తో కలిసి కేజ్రీవాల్ ప్రారంభించారు. 26 ప్రభుత్వ పాఠశాలను స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మరో 15 ప్రభుత్వ పాఠశాలల్ని మోడల్ స్కూల్స్‌గా మార్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమిళనాడులో మొదలైన ఈ పథకం ఆడపిల్లలకే కాక, దేశంలోనే విప్లవాత్మకంగా మారనుందని స్టాలిన్‌ను ప్రశంసించారు. విద్యార్థినులకు ఇచ్చే ఈ రూ. 1000 ప్రభుత్వ బాధ్యతని స్టాలిన్ తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే ఆడపిల్లల ఇబ్బందుల్ని ఈ పథకం దూరం చేస్తుందని సీఎం స్టాలిన్ చెప్పారు.

