Home Page SliderNational

హైప్‌ పెంచేస్తున్న గోపీచంద్ జర్నీ ఆఫ్‌ విశ్వం

చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్‌ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల  దర్శకత్వంలో టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న మూవీ 32. విశ్వం టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ జర్నీ ఆఫ్‌ విశ్వం వీడియోను షేర్ చేశారు మేకర్స్‌. విశ్వం టైటిల్‌తో వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్‌లో తెగిపడటం.. విధాత విశ్వం అంటూ గూస్‌బంప్స్‌ తెప్పించే టైటిల్‌ ట్రాక్‌ గోపీచంద్‌ను కొత్త గెటప్‌లో చూపిస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

తాజాగా జర్నీ ఆఫ్‌ విశ్వం వీడియోను షేర్ చేశారు మేకర్స్‌. శ్రీను వైట్ల నుంచి ప్రేక్షకులు ఆశించే ఫన్‌, సీరియస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు తాజా వీడియోతో క్లారిటీ వస్తోంది. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ వేణు దోనెపూడి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్నారు. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అంటూ హిందీలో డైలాగ్ చెబుతూ ఇప్పటికే సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేస్తున్నాడు గోపీచంద్‌. విశ్వంలో కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ఇది.