Home Page SliderInternationalNews Alert

గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్..చిటికెలో క్లిష్టమైన లెక్క తేలుస్తుంది..

గూగుల్ కంపెనీ గొప్ప ఆవిష్కారం చేసింది. ఎంతో క్లిష్టమైన లెక్కలను క్షణాల్లో తేల్చగల గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని సూపర్ కంప్యూటర్లు వేల సంవత్సరాల పాటు చేసే లెక్కలను కేవలం 5 నిమిషాలలో చేసేస్తుందని గూగుల్ తెలిపింది. క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించేందుకు దీనిని రూపొందించినట్లు తెలిపారు. సాధారణ బైనరీ భాషలా 0,1 నెంబర్లతో కాకుండా క్యూబిట్ అనే పద్దతిని వాడుతుంది. దీని సహాయంతో అపార సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తుంది. దీనిని ఆవిష్కరించిన విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇది నిజంగా అద్భుతమైన విషయం అని ఎలాన్ మస్క్ ప్రతిస్పందించారు.