పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు-20రైళ్లు రద్దు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా చందానగర్ సమీపంలో గూడ్స్ రైలు బుధవారం పట్టాలు తప్పింది. రాఘవపురం నుంచి రామగుండానికి నిత్యం ఐరన్ కాయిల్స్ సరఫరా చేసే గూడ్స్ పట్టాలు తప్పడం వల్ల పక్కనే మరో మూడు ట్రాక్ లు ధ్వంసం అయ్యాయి.దీంతో ఢిల్లీ – చెన్నై మార్గంలోని దాదాపు 20 రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది.అదేవిధంగా మరో 18 రైళ్ల రాకపోకలను దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. దెబ్బతిన్న,పట్టాలు తప్పిన 3 బోగీలను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు.