ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనిని మే 17 నుండి తిరిగి ప్రారంభించడానికి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమయంలో ఆర్సీబీ టీమ్ నుండి స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ స్వదేశానికి వెళ్లిపోయిన వార్త అభిమానులను నిరాశపరిచింది. ఇక ఐపీఎల్‌లో అతడు పాల్గొనబోవడం లేదనుకున్న అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆర్సీబీ టీమ్. హేజిల్‌వుడ్ తిరిగి భారత్‌కు వస్తున్నాడని సమాచారం వచ్చింది. నిజానికి భుజానికి గాయమై ఆర్సీబీ చివరి మ్యాచ్‌లో కూడా అతడు ఆడలేదు. అనంతర పరిణామాలతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా జరగనుండడంతో అతడు రావడం అనుమానమే అయ్యింది. హేజిల్‌వుడ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీ ప్లేఆప్స్‌కు చేరువ కావడానికి అతని పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి.

