Home Page SliderTelangana

తెలంగాణ రైతులకు రుణమాఫీపై గుడ్‌న్యూస్

తెలంగాణలో రైతులకు, కౌలు రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతులకు రూ.2,00,000 రుణమాఫీని వచ్చేవారం నుండే అమలు చేస్తామని గుడ్‌న్యూస్ చెప్పింది రేవంత్ ప్రభుత్వం. దీనికోసం ఇప్పటికే అధికారులు గైడ్‌లైన్స్ ప్రతిపాదనలను చేశారు. ఈ ఫైల్‌కు ఇంకా ముఖ్యమంత్రి ఆమోదం లభించాల్సి ఉంది. దీనికి రెండు రోజుల్లో ఆమోదం లభిస్తుందని సమాచారం. తెలంగాణలో ఇప్పటి వరకూ రూ.31 వేల కోట్లు పంట రుణాలు ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీ లోగా విడతల వారీగా పంట రుణాలు మాఫీ చేస్తామని  రేవంత్ రెడ్డి ప్రకటించారు.