News AlertTelangana

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

తెలంగాణ నిరుద్యోగుల కోసం మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్, మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 833 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్2022 సెప్టెంబర్ 23న విడుదల కానుంది.2022 సెప్టెంబర్ 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2022 అక్టోబర్ 21 చివరి తేదీ వరకు అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన జాబ్ నోటీస్‌లో ఈ కింది వివరాలు ఉన్నాయి.
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్) 62
అసిస్టెంట్ ఇంజనీర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 41
అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 13
మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 29
టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 09
అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్) 03
అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) 227
అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్) 12
అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)38
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 27
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) 68
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) 32
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) 212
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) 60